అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సొసైటీ సీఈవో... నేడు మళ్లీ ఆ సీఈవో కే చార్జి???

Submitted by venkat reddy on Fri, 30/09/2022 - 09:55
The CEO of the society facing corruption charges... Today again that CEO is in charge???
  • -డిసివో ఏలాంటి ఆదేశాలు లేకుండానే వెనిగండ్ల పిఏసిఎస్ లో సస్పెండ్ సీఈవోగా చార్జి
  • -రూ.15లక్షలు నిధులు స్వాహ చేసి సస్పెండ్ అయినా గత సీఈవో జి వి రాఘవరావు
  • -ఉన్నతాధికారులు అదేశాలు లేకుండా సొసైటీ చైర్మన్ సమీప బందువు కావడంతో సీఈవో గా రాఘవరావు చార్జి

నిడమనూరు, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి):  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సొసైటీ  సీఈవో ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయకుండా...పిఏసిఎస్ (సొసైటీ )పాలకవర్గం లేకుండానే ... సొసైటీ చైర్మన్ అనుమతితో తిరిగి ఆసొసైటీలోనే సీఈవో గా బాధ్యత స్వీకరించిన సొసైటి నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వెనిగండ్ల సొసైటీలో చోటుచేసుకుంది.బుధవారం వెనిగండ్ల పిఏసిఎస్ చైర్మన్  పాలకవర్గం సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా  నిడమనూరు మండలం వెనిగండ్ల పిఏసిఎస్ లో సీఈవో జివి రాఘవరావు సస్పెండ్ అయ్యాడు. ఈ సోసైటిలోనే మళ్లీ సీఈవో గా రాఘవరావు ను తీసుకోవాలని చైర్మన్ పాలకవర్గాన్ని వత్తిడి చేయడంతో పాలకవర్గం వ్యతిరేకించారు.  వెనిగండ్ల పిఏసిఎస్ లో సస్పెండ్ అయిన  జి.వి. రాఘవరావు ను  అక్రమంగా తిరిగి వెనిగండ్ల పిఏసిఎస్  సిఈవో గా నియమించడం సరికాదని వెనిగండ్ల పిఏసిఎస్ పాలకవర్గం పూర్తిగా వ్యతిరేకించారు.సస్పెండ్ అయినా సిఈవో ను ఉన్నతాధికారులు ఏలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ఈ సోసైటి లో మళ్లీ సిఈవో గా నియామకం చట్ట విరుద్ధమని పాలకవర్గం పేర్కొన్నారు. అనంతరం  విలేకరులతో పాలకవర్గం మాట్లాడుతూ అవినీతిపరుడుగా సస్పెండ్ అయిన వెనిగండ్ల సొసైటీ సిఈవో గా రాఘవరావు ను ఏవిధంగా చార్జి తీసుకుంటారని పాలకవర్గం ఉన్నతాధికారులపై మండిపడ్డారు. పాలకవర్గం సభ్యులు మాట్లాడుతు నల్లగొండ జిల్లా డిసివో ఏలాంటి ఆదేశాలు లేకుండా వెనిగండ్ల పిఏసిఎస్  చైర్మన్ సమీప బందువు కావడంతో తిరిగి సస్పెండ్ కాబడిన సీఈవోగా నియమించారు.ఈ విషయం పై గురువారం వెనిగండ్ల పిఏసిఎస్  పాలకవర్గం జిల్లా డిసివో సూపరింటెండెంట్  విజయ్ కు ఫిర్యాదు చేశారు.వెనిగండ్ల పిఏసిఎస్ సిఈవో గా పనిచేసిన జి.వి. రాఘవరావు గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని గతంలో డిసివో ఆదేశాలతో అతని సస్పెండ్ చేశారు . పిఏసిఎస్ ను ఆర్ధికంగా సుమారు రూ.15 లక్షల  నష్టపరిచి ఆయన సొంత అవసరాలకు, ఇష్టానుసారంగా వాడుకున్నాడు.గత డిసివో ఎంక్వైరీ ఆఫీసర్ గా అసిస్టెంట్ రిజిస్ట్రార్  రాంబాబును నియమించారు.

ఎంక్వైరీ ఆఫీసర్  సోసైటి  రికార్డులను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. ఈ విచారణ పూర్తి కాకుండా, రిపోర్టు కూడా రాకుండా ఏలాంటి ఆదేశాలు జారీచేయకుండానే  వెనిగండ్ల పిఏసిఎస్ చైర్మన్   బుధవారం  మహజనసభ నిర్వహించారు. డిసివొ ఆదేశాలు జారీ చేయకుండానే అక్రమాలకు పాల్పడిన సస్పెండ్ అయిన జి.వి. రాఘవరావును ఏలాంటి పూచికత్తు లేకుండా సభ్యులు కానటువంటి వ్యక్తులను మహాజనసభకు పిలిచి జి.వి. రాఘవరావుకు సిఈవో  గా ఛార్జి ఇవ్వనున్నట్లు  తీర్మాణం వ్రాయించుకున్నాడు. వెనిగండ్ల పిఏసిఎస్ చైర్మన్ కు  దెగ్గరి బంధువు కావడం వల్లన  వెనిగండ్ల పిఏసిఎస్ చైర్మన్ ఇష్టానుసారంగా వ్యవహరించడంతో సోసైటి  పాలకవర్గం వ్యతిరేకిస్తున్నారు.ఇదేవిధంగా రాఘవరావుపై గతంలో ఈపి చేశారు. ఈపి కూడా నేటికీ క్లియర్ విచారణ పూర్తి కాలేదు. అయినా సస్పెండ్ అయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జి.వి. రాఘవరావును చైర్మన్ ఇష్టానుసారంగా వ్యవహరించి విధులలోకి తీసుకవడం సోచనీయమన్నారు.డిసివో ఆదేశాలతో సస్పెండ్ అయిన అధికారిని మళ్లీ పిఏసిఎస్ లో నియమించకుండా వెంటనే సంబంధిత వ్యక్తులకు తగిన ఆదేశాలు జారీ చేసి వెనిగండ్ల  సొసైటీని కాపాడాలని పాలకవర్గం డిసివో ను కోరారు.అదేవిధంగా వెనిగండ్ల పిఏసిఎస్ చైర్మన్  కె.వి. రామారావు  ఇష్టానుసారముగా వ్యవహరిస్తూ రెండు ఏళ్ల  క్రితం పిఏసిఎస్ గోదాం నిర్మాణం కోసం రూ. 11 లక్షలు ఎస్టిమేషన్ వేసి త్రిమెన్ కమిటీ నియమించకుండానే పిఏసిఎస్ గోదాం డబ్బును  బ్యాంకు నుంచి రెండు విడుతలుగా చైర్మన్ డ్రా చేసినట్లు ఆరోపించారు. ఈ గోదాం నిర్మాణం పూర్తి కాకుండా ఏలాంటి ఎం.బి. రికార్డు చేయకుండా  నిధులను దుర్వినియోగం చేసి చైర్మన్ సొంత అవసరాలకు వాడుకున్నాడని పాలకవర్గం ఆరోపించారు. ఈ విషయం పై వెంటనే పూర్తి స్థాయి విచారణ చేయించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 
ఈ ఫిర్యాదు చేసిన వారిలో సోసైటి డైరెక్టర్ లు తడకమళ్ల శేఖర్, మజ్జిగపు దయాకర్ రెడ్డి,ఉమ్మడి రమణారెడ్డి, కాట్నం రవి,జంగిలి ప్రభాకర్, టిపిసిసి  సభ్యులు ముంగిశివమారయ్య, తదితరులు, పాల్గొన్నారు.