ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ ను జయప్రదం చేయండి.

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 15:55
 Celebrate the final assembly of the Praja Sangrama Yatra.

మహబూబాబాద్/ తొర్రూరు సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి) ../బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేపట్టిన నాలుగో విడత పాదయాత్ర ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ రేపు పెద్ద అంబర్ పేటలో ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి గౌ"సాద్వి నిరంజన్ జ్యోతి గారు ముఖ్య అతిథిగా హాజరై మార్గదర్శనం చేస్తారని బీజేపీ రాష్ట్ర, జిల్లా,మండల, శక్తి కేంద్రం ఇంఛార్జి, బూత్ కమిటీ సభ్యులు, బీజేపీ శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు చందుపట్ల కీర్తి రెడ్డి మరియు కట్టా సుధాకర్ లు పిలుపు ఇచ్చారు. ఈ రోజు తొర్రూర్ లో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ సన్నాహక సమావేశం తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ సభాద్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులు చందుపట్ల కీర్తి రెడ్డి మరియు కట్టా సుధాకర్ లు సంయుక్తంగా మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అని తెలిపారు.ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ధేశ రాజకీయాల గురించి ప్రక్కన పెట్టి పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి పై ధ్రృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు.తొర్రూరు  ఆసుపత్రి ని వందపడకల స్థాయికి పెంచుతామని, హామీ ఏమైందని ప్రశ్నించారు.పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయక పోవడం సిగ్గు చేటని అన్నారు.తొర్రూరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం,ట్రెజరీ, తొర్రూరు పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ వంటి హామీల అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కేవలం మీడియా లో రావడానికే ఎర్రబెల్లి మోడీ గారి పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మానుకోట జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్, జిల్లా నాయకులు రంగు రాములు, రాం మోహన్ రెడ్డి, రచ్చ కుమార్,15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్,జలగం వెంకన్న, తొర్రూరు రూరల్, పెద్ద వంగర,రాయపర్తి మండలాల అధ్యక్షులు బొచ్చు సురేష్,బొమ్మనబోయిన సుధాకర్,వడ్లకొండ రవి,తో పాటు గా అలిసేరి రవిబాబు,కస్తూరి పులేందర్, మంగళపళ్ళి యాకయ్య, పైండ్ల రాజేష్, రాయపురం రాజకుమార్, కొమ్ము రాము,కొండ యాకన్న, నూకల నవీన్,దాసరి మురళి తదితరులు పాల్గొన్నారు.