డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పై సిబి సిఐడి విచారణ చేయించాలి.

Submitted by Ashok Kumar on Thu, 29/09/2022 - 16:14
 CB CID should investigate double bedroom houses.
  • -- మంత్రి చిల్లర రాజకీయాలు మానుకోవాలి .
  • -- తప్పుడు మర్డర్ కేసు/సుఫారి అంతా హైపు క్రియేషనే 
  • -- పోలీస్ సహకారం వర్ణనాతీతం.!! 
  •  -- ప్రజలు అన్నీ చూస్తున్నారు...
  • -- హాసన్ కు బిజెపి లో  సభ్యత్వం లేదు.
  • -- అక్రమాలు చేసే వాళ్ళు మీ వెంటనే ఉన్నారు. 
  • -- ఇర్ఫాన్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు ? .
  • -- దమ్ముంటే పి ఏ ను అరెస్ట్ చేయండి.!! 
  • -- లక్కీ డిప్ ఒక్క సారి తీసి 2000 డబల్ బెడ్ రూమ్  ఇండ్లు ఎలా ఇచ్చారు.?  
  • -- ఆర్టీఐ వేస్తే 5 నెలలు గా  లబ్ధిదారుల లిస్టు ఎందుకు  ఇవ్వలేదు .?
  • -- భాజపా జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి డిమాండ్. 

మహబూబ్ నగర్  బ్యూరో (ప్రజా  జ్యోతి న్యూస్ )  సెప్టెంబర్ 29:  మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో మీ అనుచరుల హస్తం లేదని  భావిస్తే , మీకు  చిత్తశుద్ధి ఉంటే సిబి సిఐడి చే విచారణ చేయించాలని బిజెపి పై బురదజల్లే  చిల్లర రాజకీయాలు మానుకోవాలని భాజపా జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాసన్ అనే వ్యక్తికి భాజపా లో సభ్యత్వం కూడా లేదని గత 6 సంవత్సరాల క్రితం హసన్ అనే వ్యక్తి కిషన్ రెడ్డితో ఫోటో దిగిన మాట వాస్తవమేనని అంత మాత్రానా  బిజెపిపై బురదజల్లి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అక్రమ దందా చేసే మోసగాళ్లు, దళారులు  మంత్రి వెంటే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇర్ఫాన్ అనే వ్యక్తి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో డబ్బులు తీసుకొని మధ్యవర్తిగా వ్యవహరించింది వాస్తవం కాదా..?  చెక్కులు ఇచ్చింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. మరి ఈరోజు వరకు ఇర్ఫాన్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని,  వెంటనే అరెస్ట్ చేసి నిజ నిజాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు మహబూబ్ నగర్ లో  చాలా మందిపై  కేసులు పెట్టీ , దాడులు చేసి  బెదిరించి పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పుతున్నారని ఆయన మండిపడ్డారు. నేడు ప్రధాన ప్రతికల్లో పీఏ పాత్ర ఉన్నట్లు వచ్చింది కదా..!  పిఏను, పీఏ కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన పోలీసులను  ప్రశ్నించారు.  లక్కీ డిప్ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు అందిస్తామని చెప్పిన మీరు దాదాపూ దివిటీ పల్లి , క్రిస్టియన్ పల్లి, వీరన్న పేట కు సంబంధించి  2000 ఇండ్లకు గాను  ఎన్నిసార్లు లక్కీ డిప్ తీశారని ప్రశ్నించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్లు అధికారుల సాక్షిగా ఒక్కసారి లక్కీ డిప్  ద్వారా వంద మందిని లబ్ధిదారులను ఎన్నుకున్నారని, వారికి కూడా ఇంకా న్యాయం చేయలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి మంత్రికి పేద ప్రజల పట్ల  చిత్తశుద్ధి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా పార్టీ 5 నెలల నుండి అర్ టి ఐ లో లబ్ధిదారుల లిస్టు ఇవ్వమని అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మీకు పేద ప్రజలపై ప్రేమ ఉంటే లిస్టు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు . అనంతరం భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు మాట్లాడుతూ భూ కబ్జాలు, భూ దందాలను  కప్పి పుచ్చుకోవడానికే బిజెపిపై బురద చల్లుతున్నారని ఆయన విమర్శించారు. మీకు  దమ్ము ధైర్యం ఉంటే నిజాలు నిరూపించాలన్నారు. బిజెపి పార్టీ అంటే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తారా అని ఎద్దేవా చేశారు.   పాలమూరు ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో సరైన రీతిలో తగిన బుద్ధి చెప్తారని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ అంజయ్య, పడాకుల సత్యం, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు , కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు