బిఅర్ఎస్ నేతల పంతం నెగ్గిందా..? సబ్ రిజిస్ట్రార్ శ్రీలతకు నిజామాబాద్ కు డిప్యుటేషన్... అసలేం జరిగింది...?

Submitted by SANJEEVAIAH on Tue, 16/05/2023 - 12:57
Photo

పంతం నెగ్గిందా...?

బిఅర్ఎస్ నేతల పట్టు

కామారెడ్డి సబ్ రిజస్ట్రార్ కు డిప్యుటేషన్

నిజామాబాద్ ఆడిట్ కు రాక

ఆ డాక్యుమెంట్స్ క్లియర్ అయ్యేనా

(నిజామాబాద్ బ్యూరో - ప్రజాజ్యోతి)

 రాజకీయ ఒత్తిడులకు తలొగ్గిన అధికారులు కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ శ్రీలతకు డిప్యుటేషన్ వేయించారు. పలు డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ విషయంలో మొదలైన వివాదం రాజకీయంగా మారింది. దీంతో బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజిబొద్దిన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ శ్రీలత వెనక్కితగ్గక పోవడంతో అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారు. రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు డిప్యుటేషన్ వేటు వేశారు. 

బాధ్యతలు స్వీకరించిన రిజిస్ట్రార్

నిజామాబాద్ రిజిస్ట్రార్ ఎం అండ్ డి, ఆడిట్ విభాగంలోకి కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ జి.శ్రీలతకు డిప్యూటీషన్ వేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో  సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ కు కామారెడ్డి అదనపు సబ్ రిజిస్ట్రార్ గా పంపించారు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం డిప్యుటేషన్ పై వచ్చిన శ్రీలత ఆడిట్ విభాగంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 

ఆ డాక్యుమెంట్స్ కోసమైనా.?

కామారెడ్డిలోని మూడు వెంచర్లలో డాక్యు మెంట్స్ రిజిస్ట్రేషన్ల వ్యవహరమే సబ్ రిజిస్ట్రార్ శ్రీలతకు అధికార పార్టీ నేతలకు మధ్య వివాదానికి కారణం అయింది. సంబంధిత డాక్యుమేంట్స్ చేసేందుకు ససేమిరా అనడంతో రిజిస్ట్రార్ పై బదిలీ వేటు వేసే ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు అధికార పార్టీ కీలక నేత లేఖతో తప్పనిసరి పరిస్థితిలో శాఖ అధికారులు సబ్ రిజిస్ట్రార్ ను నిజామాబాద్ కు డిప్యుటేషన్ పై పంపించి వివాదానికి ముగింపు పలికారు. అయితే నాన్ లేవుట్ వెంచర్ లలో ఉన్న ఆ ప్లాట్ల డాక్యుమేంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ పై వేటు తప్పదనే ప్రచారం ఊపందుకుంది. ఏది ఏమైనా పంతం నెగ్గించుకున్న బిఅర్ఎస్ నేతలు తదుపరి వ్యవహారాలను ఎలా చక్కపెడతారో వేచి చూడాల్సిందే.