తల్లి పాలే బిడ్డ కు శ్రేయస్కరం.. ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు...f

Submitted by shaikmohammadrafi on Sat, 01/10/2022 - 10:56
 Breastfeeding is good for the baby.   MPP Yatakula Jyoti Madhubabu...

నడిగూడెం, సెప్టెంబర్ 30, ప్రజా జ్యోతి:   పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మండలంలో ఎంపీపీ  కార్యాలయంలో ఐసిడిఎస్, అంగన్వాడీల ఆధ్వర్యంలో   సామూహిక శ్రీమంతాల కార్యక్రమం  శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  ఎంపిపి శ్రీమతి యాతాకుల  జ్యోతి మధు బాబు పాల్గొని మాట్లాడుతూ  గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన ఆహారం పై అంగన్వాడి  కేంద్రాలలో కేసీఆర్  ప్రవేశపెట్టిన ఒక పూట సంపూర్ణ భోజనం పట్ల
అందరు ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీకి ప్రాధాన్యత నివ్వాలని గర్భిణీ స్త్రీలకు తెలియజేశారు. గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు. సుఖ ప్రసవాలు ప్రభుత్వ దవఖానాలో చేస్తున్నారని వాటిని ఉపయోగించుకోవాలని గర్భిణీ స్త్రీలకు సూచించారు.నార్మల్ డెలివరీ అయిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు గంటలోపే పట్టించాలని తెలియజేశారు. తల్లి బిడ్డల సంక్షేమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ కిట్టు ద్వారా వారి బాగోగులు చూసుకుంటుందని తెలిపారు. ప్రసవానంతరం బాలింతలు మంచి భోజనం తీసుకుంటూ ధనుర్వాతాం టెటనస్ వంటి వ్యాధులు బారిన పడకుండా చూడాలని ప్రతి ఒక్కరు గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్ ఉప సర్పంచ్ ఎస్.కె నసీమ మౌలానా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి విజయ చంద్రిక ఎంపీడీవో ఎం.ఎర్రయ్య సూపర్వైజర్ డి రమణ అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్లు ఏఎన్ఎంలు గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు..