బ్రాహ్మణపల్లి పిఎసిఎస్ సొసైటీ మాజీ చైర్మన్, మాజీ సీఈఓ అరెస్టు..... రూ. 88 లక్షల అవినీతి ఆరోపణలపై చర్యలు....

Submitted by SANJEEVAIAH on Fri, 06/01/2023 - 07:42
ఫోటో

ఎట్టకేలకు సొసైటీ అవినీతిపై చర్యలు

 బ్రాహ్మణపల్లి పిఎసిఎస్ సొసైటీ మాజీ చైర్మన్, సి ఈ వో అరెస్టు

రూ.88.72 లక్షల దుర్వినియోగం

"ప్రజాజ్యోతి" చెప్పింది నిజమైంది

( ప్రజాజ్యోతి ప్రతినిధి - నిజామాబాద్ - ఎడ్ల సంజీవ్)

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) సొసైటీ మాజీ చైర్మన్ తెల్లన్న అలియాస్ కాటిపల్లి గంగారెడ్డి మాజీ సీఈవో సురేందర్ రెడ్డి లను పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్ చేశారు. జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి పిఎసిఎస్ సొసైటీలు రూ.88 లక్షల 72 వేల 256 లు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతి జరిగినట్లు "ప్రజాజ్యోతి" దినపత్రిక గతంలోని వెలుగులోకి తీసుకొచ్చింది. జిల్లా కోపరేటివ్ అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేయడమే తప్ప చర్యలకు పూనుకున్నది లేదు. ఇది ఇలా ఉంటే ఆది నుంచి బ్రాహ్మణపల్లి సొసైటీలో జరుగుతున్న అవినీతి అక్రమాల తీరు, విచారణ వ్యవహారాలపై "ప్రజాజ్యోతి" దినపత్రిక మాత్రమే ఎప్పటికప్పుడు కథనాలను పాఠకులకు అందించింది. డి సి ఓ సింహాచలం ఫైనల్ విచారణ పూర్తి చేసి సంబంధిత ప్రస్తుత పాలకవర్గానికి చర్యల నిమిత్తమై లేఖ పంపారు. దీంతో మాజీ చైర్మన్ తెల్లన్న అలియాస్ కాటిపల్లి గంగారెడ్డి నుంచి ఎలాంటి రికవరీ కాకపోవడంతో ప్రస్తుత సొసైటీ చైర్మన్ అవినాష్ రెడ్డి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పాలకవర్గం తీర్మానం చేసి ఫిర్యాదు చేయడంతో డిచ్ పల్లి సిఐ మోహన్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి మాజీ చైర్మన్ తెల్లన్న అలియాస్ కాటిపల్లి గంగారెడ్డి, మాజీ సీఈవో  సురేందర్ రెడ్డి లపై 420, 408, 409 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు గురువారం వారిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు. కేసు వివరాలను జక్రాన్ పల్లి ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.