వయస్సు లేని బాలుడు మున్సిపల్ సిబ్బందిగా పని చేస్తున్నాడు

Submitted by srinu jogu on Tue, 27/09/2022 - 11:16
A boy of no age works as a municipal employee

చౌడాపూర్ మండల్ (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 24: వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ పనిలో భాగంగా రోడ్డుకు మట్టి కొడుతున్న సమయంలో గ్రామపంచాయతీ  ట్రాక్టర్ అదును తప్పి క్రింద పడింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్నే గోపాల్ కొన్ని రోజులుగా గ్రామపంచాయతీ లోని  ట్రాక్టర్ నడుపుతున్నాడు.కావున అతడు  శనివారం రోజు అతనికి వేరే పని ఉండటంతో గోపాల్ కొడుకు కర్నే రాఘవేందర్ (17) సంవత్సరాలు అతనికి వయస్సు, లైసెన్స్ కూడా లేదు ట్రాక్టర్ అతివేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆటోని తప్పియబోయి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ క్రింద పడింది, ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న బాలుడికి ప్రమాదం తప్పింది. కావున గ్రామస్తులు మాట్లాడుతూ..  వయసు లేని వాళ్ళు,లైసెన్స్ లేనివాళ్లు, వాహనాలు నడపరాదని అధికారులను కోరుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.