భద్రత ప్రమాణాలు పాటించాలి

Submitted by Gonela Kumar on Mon, 17/10/2022 - 14:40
Bhadratha pramanalu patinchali

సరైన భద్రత ప్రమాణాలు పాటించాలి

ప్రమాదాలను నివారించాలి 
డాక్టర్ సుమన్ బైనిక్

 *హైదరాబాద్ సిటీ/ప్రజాజ్యోతి:* 
దేశంలో రోడ్డు ప్రమాదాలతో అత్యధిక సంఖ్యలో మరణాలు పెరుగుతున్నాయని,ప్రజల్లో అవగాహన కల్పించడం కొరకు వరల్డ్ ట్రామా డే నిర్వహిస్తున్నామని ప్రముఖ ఆర్దోపెడిక్ సర్జన్ డాక్టర్ సుమన్ బైనిక్ వెల్లడించారు.వరల్డ్ ట్రామా డే పురస్కరించుకొని  ట్రాఫిక్ పోలీస్ వారి సహకారంతో సోమాజిగూడ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహనా కార్యక్రమాన్ని మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా అసిస్టెంట్ కమిషనర్ అఫ్ ట్రాఫిక్ పిజి రెడ్డి,మాజీ కార్పొరేటర్ శేషుకుమారి,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ పాల్గొని ప్రసంగించారు.అత్యవసర సమయంలో వైద్య సహాయం అవసరమైన వారికి సత్వర ప్రధమ చికిత్స ఎలా అందించాలో మెడికవర్ హాస్పిటల్స్, అత్యవసర విభాగం వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించారు.ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ శ్రీనాథ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయన్నారు. మితిమీరిన వేగం,హెల్మెట్ లేకపోవడం,సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి కారణాలతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో వారి విలువైన ప్రాణాలను అర్దాంతరంగా కోల్పోతున్నారని తెలిపారు.అనంతరం మాజీ కార్పొరేటర్ కుమారి మాట్లాడుతూ 90 శాతం మరణాలకు సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడమే ప్రధాన కారణమాన్నారు.ప్రతి ఒక్కరి జీవితం చాలా విలువైనది, అందరం సరైన భద్రతా ప్రమాణాలు పాటించి ఇతరులకు అవగాహనా కల్పించాలని అన్నారు. ఆర్థోపెడిక్స్ డాక్టర్ సుమన్ బైనిక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిరోజు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనాలు ఉన్నాయని,గాయాలు, మరణాలను తగ్గించడానికి, అలాగే దేశంలో  ప్రపంచవ్యాప్తంగా జరిగిన గాయల సంఘటనల అనంతర ప్రభావాలను తగ్గించడానికి ఈ ట్రామాడే  జరుపుకుంటున్నామని తెలిపారు.రోడ్డు ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా బాధాకరమైన అనుభవాలకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయన్నారు.తగిన వైద్య సమాచారం లేకుండా,రోగులు ఉన్నట్టుండి అత్యవసర స్థితిలో మా విభాగానికి వస్తున్నారని,ట్రామా(గాయాన్ని)తీవ్రతను అన్నికోణాల్లో విశ్లేషించి తక్షణమే మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడడం అనేది సవాలుతో కూడుకున్న విషయం అయినప్పటికీ మా బృందం సత్వర చికిత్సనందించడంలో నిమగ్నమై ఉంటుందని వివరించారు.24 గంటలు అనుభవజ్ఞులైన వైద్యులు,లెవల్ వన్ అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ సెంటర్‌ ఉండడం వలన ఇవన్నీ సాధ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రుషికేశ్, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.