ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఎస్ఐ ఎం. ఏడుకొండలు..

Submitted by shaikmohammadrafi on Sat, 01/10/2022 - 11:16
Be aware of online scams.  SI M. Edukondalu..

నడిగూడెం ,సెప్టెంబర్ 30 ,ప్రజా జ్యోతి:  ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి వ్యక్తిగత ఎకౌంట్లలో జరుగుతున్న ఆన్ లైన్ మోసాల పట్ల    ప్రజలు,యువకులు   అప్రమత్తంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ఎం. ఏడుకొండలు  సూచించారు. శుక్రవారం  మండల కేంద్రం లో ఆన్ లైన్ లో జరుగుతున్న మోసాలపై యువకులకు, ప్రజలతో ర్యాలీ నిర్వహించిన  అనంతరం.  ఆయన మాట్లాడుతూ నిత్యం  అనేకమంది యవకులు  ఫేస్‌బుక్,  వాట్సాప్, ట్విట్టర్, ఫోన్  మెసేజ్ ద్వారా  మీ యొక్క వ్యక్తిగత  వివరాలను అడుగుతారని మీ వ్యక్తిగత వివరాలు అపరిచిత వ్యక్తులకు తెలుపవద్దని ఓటిపిలు చెప్పవద్దని పొరపాటున చెప్పిన సో మీ ఖాతాలో ఉన్న అమౌంట్ పోగొట్టుకునే ప్రమాదం ఉందన్నారు.  ప్రజల నుండి  డబ్బులు కొల్లగొట్టేందుకు  మీకు లక్షల రూపాయల లాటరీ వచ్చిందని బంపరాఫర్ బహుమతులు వస్తాయని  లేడీ వాయిస్ తో  పలు రకాలుగా ఆశలు చూపి ఎకౌంటు నుండి    డబ్బులు కొల్లగొట్టుటకు ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి అన్నారు . అటువంటి  వాటి పట్ల తగు జాగ్రత్తగా ఉండాలని. పలు సూచనలు చేశారు. ఎవరైనా అనుకోకుండా మోసాలకి గురై డబ్బులు పోయినట్లయితే  1930  టోల్ ఫ్రీ  నెంబర్ కు ఇరవై నాలుగు గంటల లోపే సమాచారం అందించాలని తెలిపారు. లేకుంటే స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో  జమిందార్ అప్పారావు  సిబ్బంది శ్రీనివాసరెడ్డి, సక్రూ, యువకులు తదితరులు పాల్గొన్నారు...