అప్రమత్తంగా ఉండాలి -ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Sat, 01/10/2022 - 10:24
 Be alert   - MLA Nomula Bhagat

-భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలి

-సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలి

హలియా,సెప్టెంబర్30(ప్రజా జ్యోతి):  వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు నేడు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు  కురుస్తాయన్న నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్  ప్రకటన చేశారు.శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారీ వర్షాలు నేపథ్యంలో పత్రికా ప్రకటన జారీ చేశారు.అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. ముంపు ప్రాంతల ప్రజలకు ఎప్పటి కప్పుడు సమాచారం తెలియజేయాలని అన్నారు. చెరువు కట్టలు,పాత వంతెన్లు, ఇతర ప్రాణా హనీ కల్పించే విద్యుత్ తీగలు,స్తంభాలు పట్ల తగిన జాగ్రత్త లు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న గృహలలో నివాసం ఉంటున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.