బీసీ,ఎస్సీ,ఎస్టీ సబ్సిడీ రుణాలు వెంటనే విడుదల చేయాలి -జాజుల లింగంగౌడ్ డిమాండ్

Submitted by venkat reddy on Sat, 01/10/2022 - 10:34
 BC, SC, ST subsidy loans should be released immediately -Lingangaud demand of Jaju

మిర్యాలగూడ,సెప్టెంబర్ 30,ప్రజాజ్యోతి ః  సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ బీసీ,ఎస్సీ,ఎస్టీ యువత కొన్ని సంవత్సరాలుగా ఇంకెప్పుడు కార్పొరేషన్ నిధులు విడుదల చేస్తారేమోనని కళ్లలో ఒత్తులు పెట్టుకుని వేల మంది ఎదురు చూస్తున్నారని,ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తు మహాత్మా జ్యోతిభాఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 77 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని,ఎన్నికల ముందు ఆర్భాటంగా కేవలం 40 వేల మందికి మాత్రమే ఇచ్చి మిగతా వారికి మొండి చేయి చూపారని ఇంకా 5 లక్షల 37 వేల మంది ఎదురు చూస్తున్నారని,రుణాల కోసం జిల్లా సంక్షేమ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు.కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు.ఈ విషయమై బీసీ ఎమ్మెల్యే లు అసెంబ్లీలో లేవనెత్తకపోవడం చాలా బాధాకరం.మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారో చూస్తామన్నారు.వెంటనే రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ సబ్సిడీ రుణాలు అందిచాలని,లేని పక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని బీసీల ద్రోహిగా పరిగణిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,ఫరూక్,తాళ్లపల్లి సురేష్,సతీష్,హరి నాయక్ ,తదితరులు,పాల్గొన్నారు.