బతుకమ్మ సారెలొచ్చాయి

Submitted by Satyanarayana on Wed, 21/09/2022 - 19:34
Bathukamma sarelotchai

బతుకమ్మ సారెలొచ్చాయి

చీరలు పంపిణీ చేయనున్న మంత్రి అజయ్

పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి: మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశం


ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 21 ప్రజాజ్యోతి: 
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగైన బతుకమ్మ పండుగకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో రాష్ట్రం ఆడబిడ్డలకు అందించే బతుకమ్మ చీరెలు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఖమ్మం జిల్లాలో 18 ఏండ్లు నిండిన మహిళలు 5,03,668 మంది ఉండగా ఇప్పటి వరకు జిల్లాకు 3,03,000  చీరెలు వచ్చాయి. మిగతా చీరెలు రెండు రోజుల్లో రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా చీరెల పంపిణీకి సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన పంపిణీ ఏర్పాట్లను ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఈ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 18 ఏండ్లు పైబడి తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని మంత్రి అజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతో పాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో సీఎం కేసిఆర్ ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం సైతం సూమారు కోటి బతుకమ్మ చీరలను పంపీణి చేయనున్నట్లు ఈ ఏడాది గతంలో కన్నా  మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగుల, వైరైటీల్లో ఈ చీరలను తెలంగాణ టెక్స్టైల్ శాఖ తయారు చేసిందన్నారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన ఉపాది కల్పిస్తున్న ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు