బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.రాజయ్య

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:01
Bathukamma sarees were distributed by MLA Dr. Rajaiah

కాజీపేట, సెప్టెంబర్28 (ప్రజాజ్యోతి)..//.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని రాంపూర్ లో కార్పోరేటర్ మునిగాల సరోజన కరుణాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆడపడుచులకు బతుకమ్మ కానుక అందిస్తున్న 1680 బతుకమ్మ చీరలను తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి,శఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని, ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒక్కచోట చేరి రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ అని అన్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ఘనంగా నిర్వహించడమే కాకుండా తెలంగాణ ఆడపడుచులందరికీ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలను అందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను కేవలం మన రాష్ట్రంలోనే గాక , దేశ విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలంతా వారి ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తూన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శలు మరగొని రవి, బండి రవి, మాజీ కార్పరేటర్ జోరిక రమేష్, జిల్లా నాయకులు, తక్కల్లపల్లి రాంగోపాల్ రావు, దేశిని హనుమంత్ రావు, అర్షనపల్లి విజయ్ రావు, తక్కల్లపల్లి దేవేందర్ రావు, సండ్రా కుమార్, మదు రావు, మునిగాల కరుణాకర్, పిట్టల రమేష్,చందరజు శ్రీనివాస్,కోతి యాదగిరి, కడారి కుమార్, అలువల సురేష్, తొట్టె రాజు, మదశి రమేష్,యాదగిరి, పిట్టల సంబరజు, లక్కపల్లి సునీల్, దాస్, గడ్డం సదానందం, మునిగాల యాకూబ్, తక్కల్లపల్లి రంజిత్ రావు, అర్షనపల్లి శ్రీనివాస్, మునిగాల శ్రీకాంత్, బాబు, మహేష్, కాళిదాస్, ఏలందర్, మాదాశి వెంకటయ్య, సంపత్, అంగన్వాడీ టీచర్లు, డ్వాక్రా గ్రూపు సంఘాల లీడర్లు మహిళలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, అధికారులు , సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.