బతుకమ్మ చీరలను పారదర్శకంగా పంపిణీ చేయాలి డిఆర్డిఎ డి పి ఎం గంగన్న

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:35
Bathukamma sarees should be distributed transparently  DRDA DPM Ganganna

బజార్ హత్నూర్ సెప్టెంబర్ 22, (ప్రజా జ్యోతి)..///..రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను పారదర్శకంగా, రేషన్ షాప్ ల వారిగా పంపిణీ చేయాలని డిఆర్డిఏ డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ బిట్ల గంగన్న, డిపిఎం హేమలత,  ఏపీఎం సీసీలను కోరారు. గురువారం బోథ్ మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం సీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూట్ ల వారీగా చీరలు పంపిణీ చేసే బాధ్యతను సీసీలు తీసుకోవాలని అన్నారు. చీరల పంపిణీలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా పంపిణీ జరిగేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీఎం మాధవ్, సీసీలు సంజీవ్, ఎం గంగాధర్, సుభద్ర, లక్ష్మయ్య, విజయలక్ష్మి, బి గంగాధర్, శకుంతల, ఆపరేటర్ లు అశోక్, జ్యోతి వర్మ, ఆఫీస్ బాయ్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.