అంగరంగ వైభవంగా నాంపల్లి లో బతుకమ్మ సంబరాలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 10:49
Bathukamma celebrations in Nampally with grandeur

-శ్రీ కోమటి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బతుకమ్మ ఆట పాటలు 

-మాజీ ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలోకి చేరికలు

నాంపల్లి,అక్టోబర్ 2(ప్రజాజ్యోతి):  తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు ప్రతీక, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక బతుకమ్మ సంబరాలకు ఆదివారం నాడు నాంపల్లి మండల కేంద్రానికి ముఖ్య అతిథులుగా  శ్రీమతి కోమటి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాంపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలతో కోమటి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి కలిసి బతుకమ్మ ఆట పాటల కోలాటం సంబరాలలో పాల్గొన్నారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుండి బిజెపిలో భారీ చేరికలు జరిగాయి.వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి పార్టీ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా,మండల నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పూల వెంకటయ్య,సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి,పెద్దిరెడ్డి సంజీవ రాజు రెడ్డి,ప్రధాన కార్యదర్శి సింగారపు గిరి ముదిరాజ్,పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.