తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బ‌తుకమ్మ సంబరాలు

Submitted by kosgi narsimulu on Wed, 28/09/2022 - 10:58
Bathukamma celebrations are a testament to Telangana's cultural traditions

– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 
– సింధు డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలు

తాండూర్ సెప్టెంబర్ 27 ప్రజా జ్యోతి   :-  తెలంగాణ రాష్ట్ర , సంస్కృతికి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ సంబరాలు అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాడు తాండూరు పట్టణంలోని సింధు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన తీరొక్క పూలతో అలంకరించిన  బతుకమ్మ సంబరాలు అంగరక వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కళాశాల ప్రిన్సిపల్, కౌన్సిలర్ విజయదేవి, కళాశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమే బతుకమ్మ సంబరాలు  జరుపుతున్నామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ సంబరాలను తెలంగాణ సర్కారు అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. కుల మతాలకు అతీతంగా ఆడపడుచులు రకరకాల పూలతో అలంకరించిన బతుకమ్మలతో మురిపెంగా అందరూ  కలిసి  ఉత్సహాంగా జరుపు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కళాశాల వ్యవస్థాపకులు రంగారావు, నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.