అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

Submitted by sai teja on Fri, 30/09/2022 - 11:29
Bathukamma celebrations at Anurag Engineering College

అనంతగిరి,సెప్టెంబర్29,(ప్రజా జ్యోతి): మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఆటపాటలతో, కోలాటాలతో, రకరకాల పూలతో, విద్యార్థులు మహిళలు ఎంతో ఉత్సాహంతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ... బతుకమ్మ ఉత్సవాలలో ఐదో రోజు అట్ల బతుకమ్మ ను విద్యార్థులు, మహిళలు,బోధనేతర సిబ్బందిలు, ఘనంగా నిర్వహించామని తెలిపారు, తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాల వేడుకలని, ఈ పండుగని మహిళలు అందరుకలిసి తీరోక్క పువ్వులను పేర్చి ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ మన బతుకమ్మ పండుగ అని తెలిపారు, ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, మహిళ సిబ్బందులు, యాజమాన్య ప్రతినిధులు, జైపాల్ రెడ్డి, పాండురంగ ప్రసాద్, భూపతి రావు, తదితరులు పాల్గొన్నారు.