ఎదిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు" ---ప్రధానోపాధ్యాయులు హేమచంద్రుడు

Submitted by Kramakanthreddy on Sun, 25/09/2022 - 12:53
 Bathukamma Celebrations at Adira Zilla Parishad High School"  ---Pradhanopadhyaya Hemachandra

మహబూబ్ నగర్ , సెప్టెంబర్ 24 ( ప్రజాజ్యోతి ప్రతినిధి) :  జిల్లా కేంద్రంలోని , ఎదిర , 4వ వార్డ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు హేమచంద్రుడు, నాల్గవ వార్డు కౌన్సిలర్ యాదమ్మ హనుమంతు ఆధ్వర్యంలో  అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు రంగు రంగు పూలచే పెద్ద పెద్ద బతుకమ్మలను తయారుచేసారు. ఈ బతుకమ్మలను బతుకమ్మ ఆట పాటలతో , కోలాటాలాడుతూ వూర్లో ఊరేగించి చివరగా గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేసినారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హేమచంద్రుడు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతికి ఆదర్శమని , విద్యార్థులలో మన సంస్కృతి , సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ , గౌరవం పెంచే దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని తెలియజేసారు . బతుకమ్మ , దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని పాఠశాలలకు ఆదివారం అనగా 25వ తేదీ నుండి 10వ తేదీ వరకు 15 రోజులు సెలవులు ఇవ్వనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం సి ఛైర్మెన్ కర్నె నరేష్ , పాఠశాల ఉపాధ్యాయులు చెన్నప్ప , సాయిబాబా,  మహేంద్రాచారి  , భువనగిరి ,జాకీర్ హైస్సేన్ , మేరీ పుష్ప ,ఉమా రాణి, జరీన్, విద్యార్థుల తల్లిదండ్రులు , గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.