బతుకమ్మ , దసర పండుగలను సంతోషంగా జరుపుకోవాలి - సీఐ అల్లె రాఘవేంద్ర

Submitted by bosusambashivaraju on Sun, 02/10/2022 - 20:56
Bathukamma and Dussehra festivals should be celebrated happily - CI Alle

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 02 ( ప్రజాజ్యోతి ) :- 

మండలంలోని ఇప్పగూడ గ్రామానికి ఆదివారం స్టేషన్ ఘణపూర్ సీఐ అల్లె రాఘవేంద్ర విచ్చేసి గ్రామ ప్రజలతో , యువకులతో ముచ్చటించారు. తాను సీఐ గా బాద్యతలు తీసుకున్నాక మండలంలోనే పెద్ద గ్రామమైన ఇప్పగూడ ప్రజలను కలసుకోవడానికి వచ్చానని చెప్పారు. ఇలాంటి సంధర్భం గొప్ప పర్వదినాలలో రావడం మంచి పరిణామమని ఇప్పగూడ ప్రజల గొప్ప మనసులతో రాబోయే బతుకమ్మ , దసరా పండుగలు చాలా సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఈ పండగ రోజులలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గ్రామ యువత, ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించారు. బతుకమ్మ పండగ మన ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకునే విధంగా గ్రామ యువత రక్షణ కల్పించి వారంతా ఆనందంగా పండగ జరుపుకునేలా చూడాలని తెలిపారు. అదే విధంగా దసర పండుగ రోజున మధ్యపానం సేవించి వాహనాలు నడుపొద్దని , అతివేగం ప్రమాదమని, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయరాదని సూచించారు. ఈ దసర తర్వాత ఊరి ప్రజలకు హెల్మేట్ల పంపిణీ కూడా ఉంటుందని తెలియజేశారు. 

అనంతరం గ్రామంలో నరేష్ అనే అబ్బాయి పేరుతో జరిగే స్మారక క్రీడోత్సవాలలో పాల్గొని యువతను సెల్ ఫోన్స్ టీవి లకు అతుక్కుపోకుండా ఇలా ఆటలు ఆడి ఈ పండగ సెలవుల్లో దేశానికి ఉపయోగపడే యువతగా మారాలని స్ఫూర్తిని నింపారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని క్రీడాస్ఫూర్తిని చాటుతూ శారీరకంగా మానసింగా శక్తిమంతులు కావాలని యువతకు పిలిపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘణపూర్ ఎస్సై శ్రావణ్ కుమార్ , గ్రామ పోలీస్ అధికారి మోహన్ , సర్పంచ్ జక్కుల పరుశరాములు, ఉపసర్పంచ్ పోకల లక్ష్మీనర్సయ్య, స్కూల్ చైర్మేన్ రాజు, వార్డ్ సభ్యులు, పాఠశాల పిఈటి ప్రమోద్ రేడ్డి, గ్రిమ యువ క్రీడాకారులు, అన్ని పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.