బరిలో సు"దర్శనం" ఎక్కడి నుంచి.?... ఎమ్మేల్యేగానా, ఎంపీగానా... ఎమ్మెల్యే అయితే అయితే బోధన్.? ఆర్మూర్..?

Submitted by SANJEEVAIAH on Sat, 18/03/2023 - 21:59
P sudharshan reddi

సు"దర్శనం" ఎక్కడి నుంచి...?

ఎమ్మెల్యేగానా... ఎంపిగానా...

బోధన్ నుంచి ఆర్మూర్ వరకు

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి)

కాంగ్రెస్ పిసిసి కోశాధికారి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మీ ప్రాంతం వాడే అని, ఆయనను గుర్తు ఉంచుకోవాలని ప్రస్తావించగా దీనిపై సుదర్శన్ రెడ్డి స్పందించారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ "అవసరం అయితే నేను ఇక్కడి (ఆర్మూర్) నుంచి బరిలో దిగేందుకు రెడీగా ఉంటాను, నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను" అని వ్యాఖ్యానించారు. దీంతో సుదర్శన్ రెడ్డి బోధన్ నుంచి పోటీ చేస్తారా లేక ఆర్మూర్ నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఆయననే స్పందించి ఇక్కడి (ఆర్మూర్) నుంచి రెడీ ఉంటానని ప్రకటించడం ఇప్పుడు రెండు నియోజకవర్గాల రాజకీయాలలో చర్చనియాంశంగా మారాయి. ఇదిలా ఉంటే మరోవైపు నిజామాబాద్ పార్లమెంటు నుంచి ఎంపిగా పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు మధుయాష్కీ నిరాసక్తత వ్యక్తం చేసినట్లు సమాచారం. భువనగిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో ఇంతకీ సుదర్శన్ రెడ్డి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా లేక శాసన సభ కు పోటీ చేస్తారా అనే సందిగ్ధం నెలకొంది. మరోవైపు శాసన సభకు పోటీ చేస్తే బోధన్ నుంచి లేక ఆర్మూర్ నుంచి పోటీ చేస్తారా అనేది ఇప్పుడు రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారింది. ఇలా కాంగ్రెస్ లో సీనియర్, మాజీ మంత్రి, ఇప్పుడు పిసిసిలో కీలకమైన కోశాధికారి పదవిలో ఉన్నారు. అన్నింటికీ మించి రేవంత్ రెడ్డి వర్గంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది చర్చనియాంశంగా మారింది.