బాల త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు

Submitted by Sathish Kammampati on Sat, 01/10/2022 - 10:19
Bala Tripura was known as the beautiful goddess

వైభవంగా జరుగుచున్న ఉత్సవాలు

ఆలయ కమిటీ అధ్వర్యంలో నృత్య ప్రదర్శన

చిట్యాల సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి)./.. చిట్యాల పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుచున్నాయి.శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.ఎరుపు రంగు వస్త్రంతో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు.మహిళలు కుంకుమార్చనలు చేశారు. అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆచార్యతంలో పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఉత్సవ కమిటీ చైర్మన్ శీలా సత్యనారాయణ, సభ్యులు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, పోకల అచ్చాలు, సాయి రెడ్డి ప్రతాపరెడ్డి, జిట్టా శేఖర్, వరకాంతం నర్సిరెడ్డి, ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. 

అలరించిన నృత్య ప్రదర్శన


అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఆలయం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.చిన్నారులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.ప్రదర్శనలిచ్చిన  చిన్నారులు  రిషిత, నందిత, సహస్ర లక్ష్మి, శ్రీ రీత్యా రెడ్డి, అక్షర, లక్ష్మీ, సౌజిత లకు ఉత్సవ కమిటీ చైర్మన్ శీలా సత్యనారాయణ, ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి, కమిటి సభ్యులు  బహుమతులను అందించారు. మున్సిపల్  కౌన్సిలర్ పందిరి గీత తన సొంత ఖర్చులతో చిన్నారులకు ప్రోత్సాహకంగా జ్ఞాపికలను అందజేశారు.

మహాలక్ష్మి దేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారు


దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా  శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.అమ్మవారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించనున్నారు.అలంకరణకు పట్టణానికి చెందిన జయారపు శివప్రసాద్ దంపతులు దాతలుగా వ్యవహరిస్తున్నారు.