ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ లో ముసలం... ఐదు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన బడ్జెట్ సమావేశం... ఎమ్మెల్యే కలగజేసుకోవడంతోనే సమావేశానికి వచ్చిన అధికార పార్టీ కౌన్సిలర్లు... ఎట్టకేలకు బడ్జెట్ సమావేశం..

Submitted by SANJEEVAIAH on Wed, 22/02/2023 - 16:19
ఫోటో

ఆర్మూర్ మున్సిపల్ లో ముసలం 

ఐదు గంటలు ఆలస్యంగా బడ్జెట్ మీటింగ్

హాజరు కానీ అధికార పార్టీ, ప్రతి పక్ష సభ్యులు 

ఎమ్మెల్యే సూచనలతో కొనసాగుతున్న సమావేశం

( నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

ఆర్మూర్ మున్సిపల్ లో ముసలం కొనసాగుతూనే ఉంది. బుధవారం 11 గంటలకు జరగాల్సిన మున్సిపల్ బడ్జెట్ సమావేశం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కలుగజేసుకోవడంతో ఎట్టకేలకు సాయంత్రము నాలుగు గంటలకు మొదలైంది. ప్రస్తుతం మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న పండిత్ వినిత పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని అధికార పార్టీ కౌన్సిలర్లు పట్టు పట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కలుగజేసుకోవడంతో వివాదం సర్దుమనిగినప్పటికీ అంతర్గతంగా కాగుతూనే ఉంది. ఇందుకు ఉదాహరణగా బుధవారం 11 గంటలకు జరగవలసిన బడ్జెట్ సమావేశం 4 గంటలకు మొదలు అయింది అంటే వివాదం కొనసాగుతున్నట్లు అర్థం అవుతుంది. ఇందుకు అధికార పార్టీతో పాటు బిజెపి, ఎంఐఎం కౌన్సిలర్లు ఎవరు కూడా హాజరు కాకపోవడం విశేషం. మధ్యాహ్నం వరకు వేచి చూసిన మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత సరాసరి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో  ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రాజేశ్వర్ రెడ్డి కలగజేసుకుని కౌన్సిలర్లకు సూచనలు చేయడంతో ఎట్టకేలకు ఐదు గంటల తర్వాత అంటే సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి సభ్యులు హాజరయ్యారు. దీంతో బడ్జెట్ సమావేశం కొనసాగుతుంది. ఆర్మూర్ మున్సిపాలిటీలు 36 వార్డులు ఉండగా బి ఆర్ ఎస్ -, బిజెపి -5, కాంగ్రెస్ -1, ఎంఐఎం -1 ఉండగా కాంగ్రెస్ ఏకైక కౌన్సిలర్ బిఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. దీంతో 30 మంది బి అర్ ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. మెజారిటీ సభ్యులు అధికార పార్టీ వారే కావడంతో ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి పట్టు పట్టుకుని ఉన్నారు. మెజార్టీ సభ్యులు ఉన్న కౌన్సిల్ సమావేశం ఆలస్యంగా జరగడంపై రాజకీయ వర్గాలలో చర్చనీయాంశముగా మారింది. ఆర్మూర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం జాప్యంతో ఇంకా కౌన్సిల్ ముసలం కోసం కొనసాగుతుందనేది అర్థమవుతుంది. త్వరలో ఎట్టకేలకు అవిశ్వాసం ప్రవేశపెడతారని అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత భర్త పండిత్ పవన్ ఆమె మరిది పండిత్ ప్రేమ్ ల అవినీతి అక్రమాల కారణంగానే పరిస్థితి ఇలా తయారు అయిందనే ఆరోపణలు ఉన్నాయి.