
ముదురుతున్న మున్సిపల్ వివాదం
ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పై కౌన్సిలర్ల ఫిర్యాదు
హైదరాబాద్ వెళ్లిన కౌన్సిలర్లు
జీవన్ రెడ్డి పైనే ఆశలు
(ఆర్మూర్, ప్రజాజ్యోతి, పొన్నాల చంద్రశేఖర్)
ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతపై కౌన్సిలర్ మధ్య వివాదం ముదురుతుంది. చైర్ పర్సన్ వినితను తొలగించాలని అధికార బి అర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఆర్మూర్ ఎమ్మేల్యే జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నారు. చైర్ పర్సన్ పండిత్ వీనిత, ఆమె భర్త పవన్, కుటుంబ సభ్యులు ప్రేమ్ లు ఏకపక్ష నిర్ణయాలు చేయడమే కాకుండా నిధుల కేటాయింపులో తలదూర్చి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు కౌన్సిలర్ల విన్నవించినా పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లలు వాపోతున్నారు. ఏకపక్ష నిర్ణయాలపై మండిపడుతున్న కౌన్సిలర్లలు ఈ రోజు ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి పయనం అయ్యారు.
అవిశ్వాసం తప్పదా..?
ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసం తప్పదు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దానికి ఈ వివాదం బలం చేకూరుస్తుంది. అలాగే గతంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక విషయంలో మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మేల్యే హామీ ఇచ్చారని, అవకాశం వేస్తే వారికే కట్టపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు పండిత్ పవన్, పండిత్ ప్రేమ్ కపై ఇటీవల భూ పంచాయితీలు, అక్రమ భూ కబ్జాలు, మున్సిపాలిటీలో అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై ఆరోపణలు ఉన్నాయి. ఆర్మూర్ పట్టణ స్థానిక నాయకులు పలుమార్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు చేశారు. వీటిపై ఎమ్మేల్యే జీవన్ రెడ్డి సైతం హెచ్చరించిన ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు మున్సిపాలిటీలో కౌన్సిలర్లల పనులను సైతం పెండింగ్ లో పెట్టడంతో వివాదం మొదలైంది. ఈ కోవలోనే ఎలాగైనా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసి ఆవిశ్వాసం పెట్టాలనే ఆలోచనతోనే కౌన్సిలర్లలు పట్టు పడుతున్నట్లు తెలుస్తుంది. ఎమ్మేల్యే సూచనలతో నైన వెనక్కి తగ్గుతారా లేదా అనేది వేచి చూడాలి. లేక గతములో బోధన్ మున్సిపాలిటీ చైర్మన్ విషయంలో జరిగినట్లే వివాదం సద్దుమనుగుతుందా వేచి చూడాలి మరి.
- 84 views