టీఆర్ఎస్ గ్రామ పార్టీ ఇంఛార్జి ల నియామకం

Submitted by narmeta srinivas on Sun, 27/11/2022 - 18:39
టీఆర్ఎస్ గ్రామ పార్టీ ఇంఛార్జి ల నియామకం

పార్టీని మరింత బలోపేతం చేయాలి

సంక్షేమ పథకాలు, అభివృద్ధి ని గడప గడపకు వివరించాలి

మండల పార్టీ అధ్యక్షుడు : సిందె రామోజి 

పాలకుర్తి / కొడకండ్ల  ( ప్రజా జ్యోతి)  నవంబర్ 27 :  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో మండలంలోని అన్ని గ్రామాలకు బిఆర్ఎస్ (టీఆర్ఎస్) గ్రామపార్టీ  ఇంఛార్జిలను మండల పార్టీ అధ్యక్షుడు సిందె రామోజీ ఆదివారం నియమించారు. గ్రామాల వారిగా, లక్ష్మక్క పల్లి గ్రామానికి దీకొండ రమేష్, రామన్నగూడెం కే. కృష్ణమూర్తి, పెద్ద బాయి తండాకు కేలోతు సత్తెమ్మ భిక్షపతి,బొడోనికుంటతండా కురమేష్,మొండ్రాయి కి పేరం రాము,గిర్నితండాకు మేటి సోమరాములు, మైదంచెరువు తండా కు అందె యాకయ్య,నీలిబండతండా కు ధరావత్ జ్యోతి రవీంద్ర నాయక్,చెరువు ముందుతండా కు సిందె రామోజీ, రామేశ్వరం కైరోజు సత్యనారాయణ,రామవరం బాకీ ప్రేమ్ కుమార్, పాకాల కీసర ఉమేందర్ రెడ్డి,కడగుట్టతండా కు పసునూరి మధుసూదన్, కొడకండ్ల కు దీకొండ వెంకటేశ్వరరావు, హక్యతండ కు కుందూరు అమరేందర్ రెడ్డి, గుమ్మలబండతండా కు ఎండి అసిఫ్, నర్సింగాపురానికి చెంచు రాజిరెడ్డి, 
 ఏడునూతలకు జక్కుల విజయమ్మ ప్రభాకర్, 
రంగాపురం ఎండి నజీర్, రేగుల గ్రామానికి వల్లపు రెడ్డి సుధీర్ రెడ్డి,రేగుల తండాకు దూపతి సోమారెడ్డి లను నియమించారు.ఈ సందర్భంగా రామోజీ మాట్లాడుతూ గ్రామాలకు నియమించిన పార్టీ ఇంఛార్జ్ లు కార్యకర్తలను సమన్వయం చేస్తూ, గ్రామస్థాయిలో కార్యకర్తలను ఐక్యత చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రతి గడపగడపకు వెళ్లి వివరించాలని, గ్రామంలోని సమస్యలను గుర్తించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దృష్టికి తీసుకెళ్లి, సమస్యలను పరిష్కరిస్తూ, అటు గ్రామాలను అభివృద్ధి చేస్తూ,ఇటు పార్టీని పటిష్టం చేస్తూ ముందుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారని తెలిపారు.