అన్నపూర్ణ దేవి అలంకరణలో... కనకదుర్గ అమ్మవారు

Submitted by venkat reddy on Thu, 29/09/2022 - 16:25
In Annapurna Devi's decoration... Amma Kanakadurga

నిడమనూరు, సెప్టెంబర్29(ప్రజాజ్యోతి):   తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమై నాల్గొవ రోజు కు చేరుకుంది.గురువారం  కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి వేడుకలు నాల్గొవ రోజుకు కొనసాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో రాజన్నగూడెం,నారమ్మగూడెం‌తుమ్మడం రేగులగడ్డ గ్రామాల్లోని కనకదుర్గమ్మ ఆలయం భక్తులకు మహ అద్బుతంగా దర్శనమిస్తున్నాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి స్వర్ణకలశ  తొలి దుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు నవరాత్రుల్లో దుర్గామాత తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో దర్శనం ఇస్తుంది. ఆశ్వీయుజ శుద్ధ  పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమివ్వనున్నారు. గురువారం అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు కనకదుర్గమ్మ వారు దర్శనమిచ్చారు. ఐదోవరోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ,ఆరోవ రోజు మహలక్ష్మీఅవతారం, ఏడోవ రోజు సరస్వతి దేవి,ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదొవ రోజు మహిషాసురమర్థిని అలంకరణ సాయంత్రం శివ పార్వతుల శాంతికళ్యాణం,ఉరేగింపు భక్తులను అనుగ్రహిస్తారు.దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఏడాది కూడా భక్తులు  అధిక సంఖ్యలోవస్తారని అంచనా అధికారులు వేశారు. అందుకు తగ్గట్టుగానే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలు సిద్ధం చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ,మోహన్ శర్మ,భక్తులు రాజన్నగూడెం ఎంపిటిసి మజ్జిగపు లక్ష్మీ వెంకట్ రెడ్డి, సర్పంచ్ ముంగిజ్యోతిశివమారయ్య,ఆలయ కమిటీ సభ్యులు మజ్జిగపు దయాకర్ రెడ్డి, కాట్నం చిన్న వెంకటేశ్వర్లు గౌడ్ ,నాగిరెడ్డి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.