కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాం వద్ద అన్నదానం -కొనసాగుతున్న కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు

Submitted by venkat reddy on Fri, 30/09/2022 - 16:27
Annadanam at Kanakadurgamma Goddess festival statue -Ongoing Kanakadurga Navratri celebrations


 ఫోటో రైటప్ ఃఅన్నదానానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్న  

నిడమనూరు, సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి)ః నిడమనూరు మండలకేంద్రంలో  కనకదుర్గదేవి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. కనకదుర్గ శరనవరాత్రి  ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కనక దుర్గ దేవి నవరాత్రి ఉత్సవాలు  నిర్వహిస్తున్నారు.ఈసందర్భంగా శుక్రవారం నిడమనూరు లలితా దేవి రూపంలో కనకదుర్గమ్మ అమ్మవారు  భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కనకదుర్గ ఉత్సవ కమిటీ సభ్యులు ఆద్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఈసందర్భంగా భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ అన్నిదానాల కంటే అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని కొనియాడారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పంతులు తుకారం,గౌరు సాయి రాకేష్, సోమవరపు శ్రీను, నాగేశ్వరరావు, లికేష్‌,డి.యశ్వంత్, సందీప్, పవన్, నాగరాజు,సంజయ్, చౌదరి, అరుణ్, శ్యామ్, రోహిత్, చౌదరి, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.