వైభవంగా జరుగుచున్న అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు

Submitted by Sathish Kammampati on Thu, 29/09/2022 - 11:55
Ammavari Dussehra Navaratri celebrations are going on in grandeur

108 చీరలతో అమ్మవారి అలంకరణ

చిట్యాల సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి),,./// నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల పట్టణం లోని కనకదుర్గా అమ్మ వారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుచున్నాయి.బుధవారం నాడు అమ్మవారిని 108 చీరలతో అలంకరణ చేశారు. కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఉత్సవాలకు రూ.1516 లు ఆపైన విరాళాలు అందించిన దాతల గోత్ర నామాలతో  ప్రతి రోజూ పూజలు చేస్తున్నారు. పసుపు రంగు వస్త్రంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కట్టె పొంగలి ప్రసాదం ను నైవేద్యంగా సమర్పించారు.అర్చకులు వాసుదేవశర్మ ఆచార్యత్వంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, పాలక మండలి ఆదేశానుసారం ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ శీలా సత్యనారాయణ, సభ్యులు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, పోకల అచ్చాలు, సాయిరెడ్డి ప్రతాప్ రెడ్డి, జిట్టా శేఖర్, వరకాంతం నర్సిరెడ్డిలు తెలిపారు. 29వ తేదీ గురువారం రోజున 108 రకాల ప్రసాదములతో అమ్మవారికి నివేదన ఉంటుందని ఉత్సవ కమిటీ తెలిపింది.

నేడు అన్నదాన కార్యక్రమం

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చిట్యాల పట్టణానికి చెందిన పోలా పెద్దయ్య ధనలక్ష్మి దంపతులు దాతలుగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు.