రోడ్ల మరమ్మతులు చేపట్టాలని రాస్తారోకో ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష పార్టీ లు

Submitted by Sathish Kammampati on Fri, 02/09/2022 - 12:58
All party parties organized a rally to take up road repairs
  • రోడ్లను మరమ్మతు చేయండి లేదా దిగిపోండి: అఖిలపక్ష నాయకుల డిమాండ్

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 2 ( ప్రజా జ్యోతి) : మండలం లో అధ్వానంగా మారిన రోడ్లను వెంటనే నిర్మించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.  రోడ్లను నిర్మించలేని అసమర్ధ ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు.  సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శుక్రవారం నాడు అఖిలపక్ష పార్టీ లాఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో ,ధర్నా చేశారు.  ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ మండలంలోని రోడ్లన్నీ గుంతల మయంగా మారిపోయినట్లు ఆరోపించారు.

సంస్థాన్ నారాయణపూర్ నుండి జనగాం, వైర్లపల్లి ,లచ్చమ్మ గూడెం, గట్టుప్పల,  చండూరు వరకు, అంతంపేట, శివన్న గూడెం వరకు రోడ్లన్నీ అద్వాన్న స్థితికి చేరుకున్నాయని ఆరోపించారు .అదేవిధంగా నల్లగొండకు వెళ్లే ప్రధాన రహదారి తప్ప చండూర్ దేవరకొండ రోడ్డు ఇతర గ్రామాలను కలిపే రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారినట్లు ఆరోపించారు.  వర్షాలు వస్తే గుంతల మయంగా మారిన రోడ్డుపై బస్సులు కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు  అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు, గర్భిణీలు  వెళ్లలేని పరిస్థితులు దాపురించాయని ఆరోపించారు. వెంటనే రోడ్లను నిర్మించాలని మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి జక్కల ఐలయ్య యాదవ్ ,భువనగిరి పార్లమెంటరీ శాఖ కార్యదర్శి కుక్కల నరసింహ,  మండల శాఖ అధ్యక్షుడు ఏర్పుల సుదర్శన్, సిపిఐ జిల్లా కమిటీ సభ్యుడు బచ్చనగోని గాలయ్య , మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్,  గ్రామ కార్యదర్శి చెలివేరు అంజయ్య, బిజెపి మండల అధ్యక్షుడు జక్కలి విక్రం ,నాయకులు ఉప్పల లింగస్వామి, కరెంటు బిక్షపతి నాయక్ ,సాగర్ నాయక్ , షకీలా మెట్లవెంకటేశం, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.