బతుకమ్మ చీరల పంపిణీకి ముందస్తు ప్రణాళికలు

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:02
Advance plans for distribution of Bathukamma sarees

మహాదేవపూర్ సెప్టెంబర్ 22 ప్రజాజ్యోతి..///. మహాదేవపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో మండల పరిషత్ అధ్యక్షులు రాణి బాయి, అధ్యక్షతన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా బతుకమ్మ చీరలను  పంపిణీ చేయుటగాను ముందస్తు సన్నహాలలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయబడింది. ఎంపీడీవో శంకర్  మాట్లాడుతూ రేపు ప్రతి ఒక్క రేషన్ డీలర్ తాసిల్దార్ కార్యాలయం నుండి బతుకమ్మ చీరలను గైకొని శనివారం  నుండి రేషన్ షాపుల వారిగా గ్రామాలలో చీరల పంపిణీ చేయాలని సూచించారు.ఈ సమావేశo లో జడ్పిటిసి గుడాల అరుణ,  ఎంపీడీవో శంకర్, తాసిల్దార్ శ్రీనివాస్,  ఏపీఎం రవీందర్,  వివిధ గ్రామపంచాయతీల కార్యదర్శిలు, సర్పంచ్ లు,  ఎంపిటిసిలు,  రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు