ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలి - డిస్టిక్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ మోహనరావు

Submitted by Gonela Kumar on Tue, 27/09/2022 - 13:56
Adopt a healthy lifestyle  - District Fire Safety Officer Mohana Rao

 హైదరాబాద్,సిటీ,ప్రజాజ్యోతి ;  ప్రస్తుత సమాజంలో మానవులు తీవ్ర ఒత్తిడి, నిద్రలేమి, కలుషిత ఆహార పదార్థాల ద్వారా అనారోగ్యం పాలు అవుతున్నారని అలా కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని డిస్టిక్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ మోహనరావు అన్నారు. బుధవారం వరల్డ్ హార్ట్ డే ను పురస్కరించుకొని బేగంపేటలోని మెడికవర్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన  డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ - సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగాన్ని హాస్పిటల్ చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్ మహేష్ దెగ్లూర్కర్, కార్డియాలజిస్ట్ సాకేత్, న్యూరో సర్జన్ రణధీర్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో జీవితాలు రక్షించడానికి ఇటువంటి అత్యాధునిక సదుపాయాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా మనసుని ప్రశాంతంగా ఉంచితే గుండె ప్రశాంతంగా ఉంటుందని సూచించారు. అనుభవజ్ఞులైన వైద్య బృందంతో ఈ ఎక్సలెన్స్ విభాగాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చీఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ తెలిపారు. అనంతరం రూ. 499 లకు గుండె స్క్రీన్ ప్యాకేజ్ ని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మేఘ మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ రిషికేష్ తదితరులు పాల్గొన్నారు.