అడ్మిషన్స్ లో నిజామాబాద్ కార్పొరేట్ జిమ్మిక్కులు.... 2వేల మందిలో ఒక్కరికి ర్యాంక్ రాని వైనం

Submitted by SANJEEVAIAH on Sat, 20/05/2023 - 18:46
Photo

అడ్మిషన్స్ లో నిజామాబాద్ కార్పొరేట్ జిమ్మిక్కులు 

2 వేల మందిలో ఒక్కరికి ర్యాంక్ రాని వైనం

నిజామాబాద్, ప్రజాజ్యోతి, మే 19 :

నిజామాబాద్ కార్పొరేట్ కాలేజ్ లలో, స్కూల్ లలో అనుకున్న ఫలితాలు ఎందుకు రావడం లేదు. నిజామాబాద్ జిల్లా విద్యార్థుల ర్యాంకులు, ఫలితాలు ఎందుకు ప్రకటించలేకపోతున్నారు. నిజామాబాద్ లోని కార్పొరేట్ కాలేజీలలో, స్కూళ్ళలో అడ్మిషన్ చేసిన తర్వాత తల్లిదండ్రులు ఎందుకు నిస్సహాయ స్థితిలో ఉండి పోవాల్సి వస్తుంది. వేరే రాష్ట్రాలలో వేరే జిల్లాలోని బ్రాంచీలలో వచ్చిన ర్యాంకులు, ఫలితాలు పెద్దపెద్ద మల్టీకలర్ పాంప్లెట్స్ తో మన జిల్లాలో వచ్చినట్టు తల్లిదండ్రులు భ్రమింప చేస్తున్నారు.నిజామాబాద్ జిల్లాలోని విద్యార్థులకు ఫలితాలు ప్రకటించడంలో జిమ్మిక్కులు ఎందుకు చేస్తున్నారు. లేని ఫలితాలను ఉన్నట్టు చూపించడం ఎందుకు.? లోకల్ ఫ్యాకల్టీని క్వాలిటీ అనుభవజ్ఞులని చెప్పటంలో వింత దోరణి. ఇలా 
తల్లిదండ్రులను మోసం చేయడంలో జిమ్మిక్కులు చేస్తున్నారు. 

పక్క కాలేజీ పక్క స్కూల్ లో ఉన్న టీచర్ లను, లెక్చరర్ లను రూ.1000 ఎక్కువ జీతం ఇచ్చి, వారిని ఎక్కడి నుంచో వచ్చారని చూపిస్తున్నారు. ఉన్న స్కూల్ కి కాలేజ్ కి బోర్డు మార్చి బ్రాండ్ మార్క్ తీసుకొచ్చి అవే చీకటి గదుల్లో పాత బల్లాల మీద అసౌకర్యాలతో కాలం వెళ్లదీస్తూ ప్రకటనలతో మాత్రం జిమ్మిక్కులు వేసి చూపిస్తున్నారు.
నిజామాబాద్ కార్పొరేట్ స్కూల్స్, కాలేజీ విషయంలో తల్లిదండ్రులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. నిజామాబాద్ లో ఉన్న వివిధ కార్పొరేట్ కాలేజీల, కార్పొరేట్ స్కూల్లో తల్లిదండ్రులతో మాట్లాడగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కడో ఇతర రాష్ట్రాలలో, ఇతర జిల్లాలో వచ్చిన జేఈఈ మెయిన్స్ ర్యాంకులు మన జిల్లాలో వచ్చినట్లు పెద్దపెద్ద మల్టీకలర్ పాంప్లెట్స్ వేస్తున్నారు. వాటిని వాట్స్ ఆఫ్ స్టేటస్ పెట్టుకుంటు విద్యార్థుల తల్లిదండ్రులకు  వాట్స్అప్ పంపుతూ ఇన్ని జేఈ మెయిన్స్ ర్యాంకులు వచ్చాయంటూ అటు తల్లిదండ్రులను ఇటు విద్యార్థులకు భ్రమలు కల్పిస్తున్నారు. ఇలా ఆక్షనికావేషంలో అవన్నీ నిజమని నమ్మిన తల్లిదండ్రుల నుండి అడ్మిషన్లు దండుకుంటున్నారు.

వాస్తవంగా ఉదాహరణకు మల్టీకలర్ పాంప్లెట్ లో కనీసం మన జిల్లా నుండి ఒక్క విద్యార్థి అయినా ఉండకపోవడం పైగా వీరందరూ మన జిల్లా విద్యార్థులని భ్రమ కల్పిస్తు తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేస్తున్నారు.ఒక కార్పొరేట్ కాలేజీ కనీసం 2 వేల మంది విద్యార్థులను పరీక్షలు రాయించిన ఒక్క ర్యాంకు కూడా మన జిల్లా విద్యార్థికి రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. అంటే ఆ విద్యా సంస్థ లోపమా? టీచింగ్ స్టాఫ్ లోపమా? ప్రణాళిక లోపమా? విద్యార్థులను సరైన మార్గంలో  నడిపించలేకపోవడమా ? తల్లిదండ్రుల అమాయకత్వమా? తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేయడమే ధ్యేయమా.?

కనుక తల్లిదండ్రులు అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు ప్రస్తుతానికి ఇంటర్మీడియట్, జేఈఈ మెయిన్స్ ఫలితాలు మాత్రమే వచ్చినందున ఇంటర్ మార్కులు ఎన్ని వచ్చిన ఉపయోగం జీరో. కావున ప్రస్తుతం విద్యా సంస్థలు కొలమానం జేఈఈ మెయిన్స్ ఫలితాలు మాత్రమే. అవి మాత్రమే చూసి తల్లిదండ్రులు ఏ విద్యా సంస్థలో అడ్మిషన్ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. ఆ విద్య సంస్థకు జేఈఈ మెయిన్స్ ర్యాంకులు వచ్చాయా లేక వారు ఇంటర్మీడియట్ ఆ కాలేజీలో చదివారా.? ఆ ర్యాంకులు ఇంటర్ తో పాటు తొలి ప్రయత్నం లో వచ్చాయా లేక లాంగ్ టర్మ్ ర్యాంకులా.? ఆ విద్యార్థులు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ జేఈఈ మెయిన్స్ హాల్ టికెట్లను పరిశీలించి అప్పుడు తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి రావాలి. నేతి బీరకాయలో నెయ్యి ఉండకపో పోవడం ఎంత సహజమో
కార్పొరేట్ మల్టీకలర్ పాంప్లెంట్ లో మన జిల్లా విద్యార్థుల ర్యాంకులు లేకపోవడం అంతే నిజం.