సింగరేణి పివీకె 5 షాఫ్ట్ లో ప్రమాదం

Submitted by Srikanthgali on Sat, 03/12/2022 - 16:35
Accident in Singareni PVK 5 shaft

సింగరేణి పివీకె 5 షాఫ్ట్ లో ప్రమాదం

ఇద్దరు కార్మికులకు గాయాలు

కొత్తగూడెం క్రైమ్, డిసెంబర్ 03, ప్రజాజ్యోతి:

సింగరేణి పీవీకే 5 షాఫ్ట్ లో శనివారం విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులకు రూఫ్ టాప్ కూలిపోయి గాయాలు అయ్యాయి. పాల్వంచ మండలానికి చెందిన శంషుద్దీన్ (54) జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తాడు. అదేవిధగా రామవరం నికి చెందిన వినోద్ కుమార్ (27) యాక్టింగ్ వెల్డర్ వీరు ఇద్దరు సింగరేణి పీవీకే 5 షాఫ్ట్ లో కార్మికులు. విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కసారిగా రూఫ్ టాప్ కూలి పడినట్లు తోటి కార్మికులు తెలిపారు. వెంటనే అధికారులకు సమాచారం అందించి వారిని సింగరేణి అంబులెన్సు లో హుటా హుటిన సింగరేణి ఏరియా ప్రధాన ఆసుపత్రి కి తరలించడం జరిగింది అని అన్నారు. వీరిలో ఒకరికి నడుము భాగం లో మరొకరికి కాలు పై తీవ్రంగా గాయాలు అయ్యాయి అని వైద్యులు తెలిపారు. వారి పరిస్థితి విషమం గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు వైదులు తెలిపారు.