అర్హతలు ఉన్నా ఆసరా పింఛను లేదు... ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఒంటరి దివ్యాంగ వృద్ద మహిళ

Submitted by lenin guduru on Wed, 19/10/2022 - 13:02
Aasaraa

అర్హతలు ఉన్నా ఆసరా పింఛను లేదు

ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఒంటరి దివ్యాంగ వృద్ద మహిళ

బచ్చన్నపేట , అక్టోబర్ 19 (ప్రజాజ్యోతి): 
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన
జంగిటి బుచ్చమ్మ నాలుగు సంవత్సరాల క్రితం ద్విచక్ర వాహనం మీద  ప్రయాణం చేస్తుండగా  జరిగిన ప్రమాదంలో భర్త యాదగిరి మరణించాడు, బుచ్చమ్మ కాలు పూర్తిగా విరిగిపోయింది, అప్పటి నుండి ఒంటరి వికలాంగ మహిళాగా అతి కష్టంగా జీవనం సాగిస్తున్నది. ఆమెకు ప్రస్తుతం ఎలాంటి ఆదాయం లేదు  కనుక వంట చేసుకోవడానికి కనీస సామాన్లు లేక   నరకం అనుభవిస్తున్నది. కనీసం పెన్షన్ సౌకర్యం వచ్చినా ఇంత అసరాగా  ఉండేది,  ఆమెకు ఒక కన్ను కూడా లేదు,ఒక కాలు పూర్తిగా లేదు భర్త లేడు, ఒంటరి మహిళ 58 సం,, పైబడిన కూడా  ఇన్ని అర్హతలు ఉన్నా  పెన్షన్ సౌకర్యం కోసం ఎవరిని అడిగినా గ్రామ సభలో ఎన్నోసార్లు చెప్పినా కూడా పెన్షన్ సౌకర్యం ఇంత వరకు రాలేదు దయచేసి అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి వీలు అయినంత త్వరగా  పెన్షన్ సౌకర్యం ఇప్పించాలని మనవి చేసుకుంటుంది. ఓట్లు ఉన్నపుడు నా చుట్టూ తిరిగి నీకు పెన్షన్ పెట్టిస్తా  అని చెప్పి ఓట్లు అయిపోగానే  నేను ఎన్ని సార్లు అధికారులచుట్టూ తిరిగిన నన్ను పట్టించుకున్న మానవుడు లేడు అని ఆమె గోడు వెళ్ళ బోసుకుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఏర్పాటు చేయాలని కోరింది.