ఆ ఆత్మహత్యల వెనుక మర్మమేమిటి.?... ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మహత్యలు... ఉద్యోగ సంఘాల మౌనం ఏలా..?..

Submitted by SANJEEVAIAH on Wed, 18/01/2023 - 23:15
ఫోటో

ఆ ఆత్మహత్యల వెనుక మర్మమేమిటి.?

ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మహత్యలు

ఉద్యోగ సంఘాల మౌనం ఎలా.?

శృతిమించుతున్న ఒత్తిడి

ఆందోళనలో కుటుంబ సభ్యులు

( నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

నిజామాబాద్ జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో 6 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరో ఆరుగురు వివిధ కారణాలతో అనారోగ్యాలతో హార్ట్ ఎటాక్ చనిపోయారు. అసలు ఈ ఆత్మహత్యల వెనుక ఏమిటి అనేది ఎవరికి అంతుచిక్కడం లేదు.  అయితే ఎటువైపు నుంచి చూసిన ప్రజా ప్రతినిధుల ఒత్తిడి, అధికార పార్టీకి చెందిన నాయకుల వేధింపులు అనేది బహిరంగంగానే  చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవమో కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రాణాన్ని పణంగా పెట్టి ఆత్మహత్యలు చేసుకోవడం అంటే నివ్వెర పోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నవారు కూడా ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశముగా మారుతుంది.  అందుకు ఉదాహరణగా ఆర్మూర్ నీటిపారుదల శాఖ డి ఈ వెంకటరమణారావు ఆత్మహత్య సంచలనం సృష్టించింది. దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన సిబిఐటి కళాశాలలో ఇంజనీరింగ్ చదివి ఎన్నో ఉన్నత అవకాశాలు వచ్చినా వదిలేసి ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే వెంకటరమణారావు ఆత్మహత్య వెనక అసలు మరణం ఏమిటి అనేది అంతుచికడం లేదు. ఇదే కోవలో రూరల్ నియోజకవర్గంలోని  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) సొసైటీ సీఈవో సునీల్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గంలో బదిలీ కావడం లేదని ఉపాధ్యాయురాలు, అంతకు మునుపు రెవెన్యూ శాఖలోని ఓ ఎం ఆర్ ఓ, మున్సిపల్ నిజామాబాద్ నగరపాలక సంస్థలు విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్ ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలు హృదయ విదారకంగా ఉన్నప్పటికీ వీటి వెనుక అసలు కారణాలు ఏమిటి అనేది ఇంత వరకు బయటకు రాలేదు. ఉన్నత అధికారులు సైతం ఈ ఆత్మహత్యలను పట్టించుకునే పాపాన పోవడం లేదు. ఇది ఇలా ఉంటే ఉద్యోగ సంఘాలు సైతం ఆత్మహత్యల విషయంలో మౌనం వహించడంతో విమర్శల పాలవుతున్నాయి. సంబంధిత శాఖల ఉద్యోగ సంఘాలతో పాటు ప్రభుత్వ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టి. జీ.వో), నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘాల (టి.ఎన్. జీ. వో) పాటు ఆయా సంఘాలు సైతం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో ప్రభుత్వ శాఖలలో పనిచేస్తే ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. దీనిపై ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు స్పందించి ఆత్మహత్యల వెనుక దాగి ఉన్న అసలు కారణాలను వెలికి తీసేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వ పెద్దలు సైతం వీటిపై స్పందించి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఆత్మహత్య సంఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఫ్రెండ్లీ ఉద్యోగం పేరుతో ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిన ప్రజాప్రతినిధుల ఒత్తిడి మాత్రం మూడింతలు పెరిగింది. చెప్పింది వినకపోతే వేధింపులకు గురి చేస్తున్నారు. వింటే ముందు తప్పులు చేయించి, ఆ తరువాత వాటినే అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వీటి వల్లనే ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తుంది. డీ ఈ ఈ కి రూ.40 లక్షల పంచాయితీ ఉన్నట్టే, గత ఏడాది ఆత్మహత్య కు పాల్పడిన ఉద్యోగికి రూ.16 లక్షల అప్పుల పాలు చేయించిన మరో అధికారి, ప్రజా ప్రతినిధి ఉద్యోగి ఆత్మహత్యకు కారణం అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆత్మహత్యల వ్యవహారంపై "ప్రజాజ్యోతి" దినపత్రిక వరుస కథనాలను ప్రచూరించనుంది. నీటిపారుదల శాఖ డిఈఈ ఆత్మహత్య వెనుక అసలు కారణాలేమిటి అనేది అంతుచిక్కని వైనం అసలు ఏం జరిగింది...?

 

రేపటి సంచికలో.... డీ ఈ ఈ వెంకటరమణ రావు అంతిక్రియాలకు రూ.5 లక్షలు పంపిన ప్రజా ప్రతినిధి ఎవరు.? ఆత్మహత్య కారణాలు ఎంటి.?