అక్రమంగా నిల్వ చేసిన 46 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత

Submitted by Paramesh on Mon, 03/10/2022 - 15:23
 46 quintals of illegally stored ration rice seized

నేరేడుచర్ల, అక్టోబర్ 2(ప్రజా జ్యోతి):  నేరేడు చర్ల మండలం బరుగుల తండా గ్రామంలో అక్రమంగా నిలవచేసిన 46 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్న నేరేడు చర్ల మండల ఎస్ ఐ నవీన్ కుమార్. ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపినవివరాలప్రకారం బూర్గుల తండా గ్రామానికి చెందిన మాలోత్ సుజాత భాయ్ అనే మహిళ నేరేడుచర్ల లోని ఆటో నగర్ ల్లో నివసిస్తూ కిరాణా షాపు నడుపుచున్నది . ఈమె స్వల్ప కాలంలో అక్రమంగా అధిక డబ్బులు సంపాదించాలని దురా ఆలోచనతో రేషన్ బియ్యాన్ని  ప్రజల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మాలని ఇంట్లో నిల్వ చేసుకొంది. నెమ్మదగిన సమాచారం నిమిత్తం అక్రమంగా నిలువ చేసిన సుమారు 46 క్వింటాల  బియ్యంను  ఆదివారం పట్టుకొని  కేసు నమోదుచేసినట్లు తెలిపారు.అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని ఎవరైనా అక్రమా రవాణా చేసినా కొనుగోలు చేసిన ఎంతటి వారైనా వదిలేదూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.