16న జరిగే ఉధ్యుగుల సదస్సును జయప్రదం చేయండి... టి ఎన్ జి వో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పిలుపు

Submitted by SANJEEVAIAH on Sun, 15/01/2023 - 19:34
ఫోటో

పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగి హక్కు

16న ఉద్యోగుల సదస్సును విజయవంతం చేయండి

 ఆలుక కిషన్ టిఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు,ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్

(నిజామాబాద్, ప్రజాజ్యోతి)

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టి ఎన్ జీ వో) ఆధ్వర్యంలో 16న సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో  "భారత రాజ్యాంగం  సామాజిక న్యాయo - సవాళ్ళు" అనే అంశంపై జరిగే భారీ సభను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా టీఎన్జిఓఎస్ అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మైన్ ఆలుక కిషన్, ప్రధాన కార్యదర్శి అమృత్ కుమార్ జిల్లా యూనియన్ సభ్యులు, జిల్లాలోని అన్ని విభాగాల కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు నిరంతరం ఉద్యోగుల సమస్యలపై, భారత రాజ్యాంగ పరిరక్షణకై  ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న  యూవకిశోరం చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ( jnu) ప్రొఫెస్సర్స్ మనీష్ కుమార్, జతిన్ గోరియా, తెలంగాణ రాష్ట్ర టీఎన్జిఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు 
మామిళ్ల రాజేందర్, కార్యదర్శి రాయకంటి ప్రతాప్, లు హాజరవుతారని తెలిపారు.  ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్య అతిథులు ప్రసంగిస్తారన్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాస్వామికవాదులు  ప్రజా, కుల, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు, పూలే,vఅంబేద్కర్ల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తు రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు  పెద్దఎత్తున ఇదే మా వ్యక్తిగత ఆహ్వనంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాత పెన్షన్ విధానానికి మోకాలడ్డుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (cps)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (ops) ను తిరిగి పునరుద్ధరించాలన్నారు. ప్రజాధనంతో నిర్మితమైన ప్రభుత్వరంగాన్ని ప్రయివేటు కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న కేంద్రప్రభుత్వం తక్షణమే ప్రయివేటురంగం కర్పొరేటికరణను నిలిపివేసి ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలనీ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఐటీ సీలింగ్ ను తక్షణమే పదిలక్షలకు పెంచేవిధంగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ కోరారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రాజ్యాంగబద్ద హక్కులను కాలరాస్తున్న కేంద్రప్రభుత్వ తీరుపై ప్రజాస్వామ్య బద్ధంగా పోరాదాలని పిలుపునిచ్చారు.